![]() |
![]() |
సద్దాం.. పటాస్ షో ద్వారా ఫేమస్ అయ్యాడు. తనదైన పంచులతో ఆ షో జడ్జ్‌లని కడపుబ్బా నవ్వించే సద్దాం.. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఎన్నో స్కిట్లు చేశాడు. ఇతని స్కిట్ల కోసమే సగం మంది శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారనేది వాస్తవం. ఎందుకంటే సెటైరిల్ డైలాగ్స్‌తో, అతని తోటి టీమ్ సభ్యులపై పంచ్‌లు వేస్తూ నవ్విస్తుంటాడు. అయితే కొన్ని నెలల క్రితం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సద్దాం.
సద్దాం, యాదమరాజు కలిసి ఒకేసారి జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ షోలో రాఘవ, బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ తర్వాత మళ్లీ అంతటి ఫ్యాన్ బేస్ వచ్చింది సద్దాం స్కిట్స్‌కే అని అనడంలో ఆశ్చర్యం లేదు. తాజాగా సద్దాం, యాదమరాజు కలిసి జబర్దస్త్ లో ‘ఓసేయ్ రాములమ్మ’ స్పూఫ్ చేసారు. ఇప్పుడు ఈ స్కిట్ ఫుల్ ట్రెండిరగ్‌లో ఉంది. అయితే సద్దాం రెండు సంవత్సరాల క్రితం సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేశాడు. ఇందులో తన పర్సనల్ విషయాలని, టూర్స్, లొకేషన్స్, స్కిట్స్ అంటూ కొన్ని వ్లాగ్‌లని పోస్ట్ చేస్తున్నాడు. కాగా ఈ వ్లాగ్‌లకి ఇప్పుడు ఫుల్ క్రేజ్ వస్తుంది.
సద్దాం తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ‘ఎన్నో రహస్యాలు దాగి ఉన్న గుర్రంకొండ’ అనే వ్లాగ్‌ని అప్‌లోడ్ చేశాడు. ఇందులో తన జబర్దస్త్ టీమ్ మేట్స్ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ప్లేస్‌కి వెళ్ళాడు సద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ సరిహద్దులోని అన్నమయ్య జిల్లాలో ఈ గుర్రంకొండ ఉందని, దీనిని ఒకప్పుడు జాఫ్రాబాద్ అని పిలిచేవారని సద్దాం చెప్పాడు. అలాగే దానికి దగ్గరలోని ‘రంగిని మహల్’ని చూపించిన సద్దాం.. దీనిని టిప్పు సుల్తాన్ కొంత కాలం ఏలారని చెప్పాడు. యుద్దంలో పాల్గొనే గుర్రాలని ఈ కొండచుట్టూ ఉంచేవారట. దానితో పాటు ఆకాశం నుండి చూస్తే ఈ కొండ.. గుర్రం ఆకారంలో ఉంటుందట. అందుకే దీనిని గుర్రంకొండ అంటారని సద్దాం చెప్పాడు. తన ఫ్రెండ్ సందీప్ ఇంకా ముగ్గరు స్నేహితులతో సద్దాం ఈ గుర్రంకొండకి వెళ్ళాడు. చాలా ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఈ గుర్రంకొండని చూపిస్తూ వ్లాగ్‌లో వివరించాడు సద్దాం. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.
![]() |
![]() |